Illu illalu pillalu : చందు, శ్రీవల్లిల ఎంగేజ్ మెంట్.. వాటర్ క్యాన్ లు మోస్తూ చూసిన ధీరజ్!
on Mar 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -116 లో.....శ్రీవల్లి చందు గురించి మంచిగా చెప్తుంటే కోడలు అంటే నువ్వమ్మ.. నీలా ఉండాలి.. నాకు బాగా నచ్చావని శ్రీవల్లిని పొగుడుతుంది వేదవతి. అందరు మన బుట్టలో పడిపోయారు.. నా కూతురు అత్త కూడా నా కూతురు వైపు ఉంది. ఇంటికి వచ్చాక చక్రం తిప్పడమే అని భాగ్యం అంటుంది. అందరు చందు, శ్రీవల్లి ఇద్దరిని మధ్యలో పెట్టి డాన్స్ చేస్తుంటారు.
ఆ తర్వాత నర్మద టీ తాగుతుంటే అప్పుడే వేదవతి వచ్చి.. నాకు ఒక టీ పెట్టు అంటుంది. నర్మద మాత్రం టీ పెట్టకుండా అటు ఇటు తిరుగుతుంది. ఏమైందని వేదవతి అడుగుతుంది. ఇంకా కోడలుగా మీ పెద్ద కోడలు ఇంట్లో అడుగే పెట్టలేదు అప్పుడే నా కోడలు బంగారం అంటూ ముద్దాడుతున్నారు.. ఇన్ని రోజులు అవుతుంది ఇంటికి వచ్చి ఎప్పుడైనా నాతో సరిగ్గా మాట్లాడారా అంటూ నర్మద అనగానే నర్మదని వేదవతి హగ్ చేసుకొని నా కోడలు బంగారం అని చెప్తుంది. ఇక చాలా అని వేదవతి అనగానే.. మీరు నాకు ముద్దు పెట్టాలని ఇలా చేసానని నర్మద అంటుంది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు అందరూ ఎంగేజ్ మెంట్ కి రెడీ అవుతారు. ధీరజ్ ని వద్దని రామరాజు చెప్తాడు. వీడి వల్ల ఏదో ఒక గొడవ అవుతుందని అంటాడు నా ఎంగేజ్ మెంట్ కన్నా నా తమ్ముళ్లు నాతో ఉండడం కావాలని చందు అంటాడు కానీ నాకు ఇష్టం లేదని రామరాజు అంటాడు. దాంతో ధీరజ్ లోపలికి వెళ్తాడు. అందరు వెళ్తుంటే ప్రేమ అక్కడే ఉంటుంది. రా అని ప్రేమని తీసుకొని వెళ్తాడు రామరాజు.
ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ గుడిలో ఏర్పాట్లు చేస్తుంది భాగ్యం. ఫంక్షన్ హల్ ఎక్కడ అని భాగ్యాన్ని రామరాజు అడుగుతాడు. మీరు గుడికి రండీ అని భాగ్యం వాళ్లతో చెప్తుంది. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో చందు, శ్రీవల్లిల ఎంగేజ్మెంట్ గుడిలో జరుగుతుంది. అక్కడికి వాటర్ క్యాన్ లు మొయ్యడానికి ధీరజ్ వస్తాడు. వాళ్ళ ఎంగేజ్ మెంట్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ధీరజ్ క్యాన్ లు మోస్తూ భాగ్యం కి డాష్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
